తెలంగాణలో మందుబాబుల క్రమశిక్షణ భేష్…

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి KCR ఆదేశాలతో మద్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఐతే ఇందులో కిక్కు ఏముంది అనుకుంటున్నారా అసలు విషయం ఏంటంటే దేశానికి ఆదర్శంగా నిలిచేలా తెలంగాణ పోలీసులు మందుబాబులకు క్రయవిక్రయాల సమయంలో క్రమశిక్షణ నేర్పారు. లిక్కర్ దుకాణాల ఎదుట ఒకరిపై ఒకరు తోసుకోకుండా పోలీసులు ముందుగానే ఏర్పాటు చేసిన సర్కిల్ లో వ్యక్తులు నిలబడి మద్యం దుకాణాల ఎదుట క్యూలో ఒక్కొక్కరు మద్యం కొనేందుకు కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ భౌతిక దూరంతో కొనే ఏర్పాట్లు చేశారు.

నిన్నటి వరకు దేశమంతటా లిక్కర్ కోసం దుకాణాల ఎదుట జాతరలా జనం తోపులాటలు చూసాం కానీ తెలంగాణలో KCR ముఖ్యమంత్రి ఇక్కడ ముందుగానే ప్రెస్ మీటులో హెచ్చరించారు. మందుబాబులు క్రమశిక్షణ పాటించకపోతే మూసేస్తానని KCR చెప్పడంతో లిక్కర్ బాబులు పోలీసుల సూచనలు పాటిస్తూ మద్యం కొనుగోళ్లు చేయడం సంతోషకరం.