తెలంగాణలో లాక్ డౌన్2 మే7 వరకు

తెలంగాణలో లాక్‌డౌన్ మే 7వరకూ పొడగిస్తూ CM KCR ప్రకటించారు. లాక్‌ డౌన్2 అమలులో సడలింపులు ఉండవని కూడా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర కేబినెటులో చర్చించిన తర్వాత ప్రజారోగ్యం దృష్ట్యా ఈనిర్ణయం తీసుకున్నామన్నారు. స్విగ్గి, జోమాటోలకు కూడా అనుమతిని నిరాకరించారు.

కేంద్రం ప్రకటించిన ఏప్రిల్ 20 తర్వాత లాక్‌ డౌన్2 సడలింపులు తెలంగాణ రాష్ట్రం మాత్రం కేసుల నమోదుకు6దృష్టిలో ఉంచుకుని నిర్ణయించింది. ఇప్పటి వరకు జరుగుతోన్న విధంగానే నిత్యావసరాలు అందుబాటులో ఉండనున్నాయి. రాష్ట్ర కేబినెట్‌లో సహచర మంత్రులతో చర్చించిన అనంతరం మే 7వరకూ తెలంగాణలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నామన్నారు.