తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు ఆరంభం

తెలంగాణ రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు ఆరంభమయ్యాయి. కోడంగల్ నియోజకవర్గం మద్దూరులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. కరోనా వైరస్ మహమ్మారితో భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలకు, రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. రైతు పండించిన ప్రతీ ధాన్యం గింజనూ కొనుగోలు చేసే భాధ్యతను తెలంగాణ సర్కారు చూసుకుంటుంది. రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు పాటించి పోలీసులు వైద్య సిబ్బందికి సహకరించడని సర్కారు, తెలంగాణ ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు.