అంత‌ర్జాతీయ స్థాయికీ చేరిన తెలంగాణ సోనా మ‌సూరి ప్ర‌తిష్ట‌

* అంత‌ర్జాతీయ స్థాయికీ చేరిన తెలంగాణ సోనా మ‌సూరి ప్ర‌తిష్ట‌
* ప్ర‌తిష్టాత్మ‌క అమెరిక‌న్ జ‌ర్న‌ల్‌లో క‌థ‌నం ప్ర‌చుర‌ణ‌
* దేశంలో ఆద‌ర‌ణ పొందిన సోనా వ‌రి విత్త‌నం
* సీఎం కేసీఆర్ ప్రోద్భ‌ల‌తంతో అద్భుత ఫ‌లితాలు
* జాతీయ స్థాయిలో ప్రొఫెస‌ర్ వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యం
27 వ ర్యాంక్ నుంచి మూడో ర్యాంకుకు చేరుకున్న వ‌ర్సిటీ

అంత‌ర్జాతీయ స్థాయిలో సోనా మ‌సూరి వ‌రి వంగ‌డానికి గుర్తింపు ద‌క్కింది. ఎందుకంటే ప్ర‌తిష్టాత్మ‌క అమెరిక‌న్ జ‌ర్న‌ల్‌లో తెలంగాణ సోనా మ‌సూరి విత్త‌నానికి భారీ డిమాండ్ నెల‌కొంద‌నే క‌థ‌నం రావ‌డం. దీంతో అంత‌ర్జాతీయ స్థాయికి సోనా మసూరి వ‌రి వంగ‌డం చేరుకోవ‌డం గ‌మ‌నార్హం. తెలంగాణ రాష్ర్టం వ్య‌వ‌సాయ రంగంలో అద్భుత ఫ‌లితాలు సాధిస్తున్న తరుణంలో అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అమెరిక‌న్ జ‌ర్న‌ల్ లో స్థానం సంపాదించ‌డం విశేషం. గ‌త ఆరు సంవ‌త్స‌రాల అతి త‌క్కుల కాలంలోనే జాతీయ స్థాయిలో అంద‌రినీ దృష్టిని ఆక‌ర్షిస్తున్న రాష్ర్టం..ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయ స్థాయికి ఎద‌గ‌డం శుభ‌ప‌రిణామాం. రాష్ర్ట ఏర్పాటుకు ముందు జాతీయ స్థాయిలో 27వ ర్యాంక్‌లో ఉన్న ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యం, ప్ర‌స్తుతం సీఎం కేసీఆర్ అందిస్తున్న ప్రోత్సాహంతో జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్‌కు చేరుకుంది. సౌత్ ఇండియాలో మొద‌టి ర్యాంక్‌లో ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇదే విశ్వ‌విద్యాల‌యం రైస్ రీసెర్చ్ సెంట‌ర్ త‌యారు చేసిన తెలంగాణ సోనా అనే వ‌రి వంగ‌డం దాదాపు ఏడు రాష్ర్టాల రైతుల ఆద‌ర‌ణ పొందింది. దీంతో సోనా వ‌రి విత్త‌నం లైసెన్స్ కోసం ఇత‌ర రాష్ర్టాల వ‌రి విత్త‌న వ్యాపారులు జ‌య‌శంక‌ర్ వ‌ర్సిటీ వ‌ద్ద క్యూ క‌ట్టేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు స‌మాచారం.

సోనా మ‌సూరి ప్ర‌త్యేక‌త‌లు ఇవే:
-తెలంగాణ సోనా మ‌సూరినీ పండించ‌డానికి కేవ‌లం 125రోజుల స‌మ‌యం మాత్ర‌మే ప‌డుతుంది. దిగుబడి కూడా ఇతర వంగడాల కంటే 5 నుండి 10 శాతం ఎక్కువ రావడం దీని ప్రత్యేకత . సాంబా మసూరి ఎకరానికి 22 క్వింటాళ్ల దిగుబడి వస్తే తెలంగాణ సోనా వరి వంగడం 28 క్వింటాళ్ల దిగుబ‌డి వస్తుంది . వ‌ర్షాకాలం, , యాసంగి రెండు పంటలు పండించుకునే వెసులుబాటు ఉండ‌టం మరో ప్రత్యేకత . తక్కువ రోజుల్లో పంట రావడం వల్ల నీటి అవసరం తక్కువ ఉండడంతో పాటు పంట‌-పంట‌కు మధ్యలో జనుము , పిల్లి పెసర , పెసర వంటివి వేసుకోవ‌డంతో భూమి సారం పెరుగుతుంది . మిగతా ఎరువుల వినియోగం , ఖర్చు కూడా తగ్గుతుంది. కేసీఆర్ వంటి ఒక గొప్ప నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే తెలంగాణ వంటి ఒక రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందో ఈ ఒక్క సోనా మసూరి వరి వంగడం సృష్టిస్తున్న అద్భుత ఫలితాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తెలంగాణ లో రెండు క్రాప్స్ కలిపి 225 లక్షల టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చినా ఇబ్బంది లేదని బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్ర‌స్తావించిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా గమనించాలి . రైతు బంధు , రైతు బీమా , 24 గంటల ఉచిత విద్యుత్తు , సుమారు రెండు లక్షల కోట్ల ప్రణాళికతో సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్న సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వల్ల తెలంగాణ వ్యవసాయ రంగం అద్భుత ప్రగతి దిశగా అడుగులు ముందుకు వేస్తున్నది . రానున్న రోజుల్లో తెలంగాణ వ్యవసాయ రంగం ఇంకా విప్లవాత్మక మార్పులతో చరిత్ర సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ త‌రుణంలోనే
అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ సోనా వరి వంగడంపై అమెరిక‌న్ లాంటి జ‌ర్న‌ల్ లో క‌థ‌నం ప్ర‌చురిత‌డం కావ‌డం గ‌మ‌నార్హం.

చ‌క్కెర వ్యాధికి చెక్‌:
– తెలంగాణ సోనా వరి వంగడం ప్రత్యేకత ఏమిటంటే తక్కువ కార్బో హైడ్రేట్స్ ఉండి టైప్ -2 షుగర్ ను కూడా తగ్గించగలగడం . గ్లూకోజ్ శాతం కేవలం 51.6 మాత్రమే ఉండడం వల్ల ఈ తెలంగాణ సోనా వరి అన్నం తినే వారికి షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఉండవు . ఇతర వరి వంగడాల్లో గ్లూకోజ్ శాతం 55 నుండి 62 శాతం వరకు ఉంటుంది . జొన్నలు , సజ్జలు వంటి చిరు ధాన్యాల్లో ఉండే స్థాయిలోనే ఈ వరి బియ్యం లో కార్బో హైడ్రేట్స్ ఉండడం దీని ప్రత్యేకత . ఈ విషయాన్ని హైద‌రాబాద్‌లోని తార్నాక స‌మీపంలో జాతీయ పోష‌కాహార సంస్థ సోనా వరి వంగడాన్ని ఎనాలసిస్ చేసి ధ్రృవీక‌రించింది.