TS ఉన్నతాధికారులు పర్యవేక్షణ/ప్రచారం

హైదరాబాద్ నగరంలో కరోనా కట్టడికి ఉన్నతాధికారులు స్వయంగా వైరస్ సోకిన ప్రాంతాలను సందర్శిస్తున్నారు.
నాంపల్లి సమీపంలోని మల్లపల్లిలో బడి మజిద్ ఏరియాను పర్యవేక్షించారు. తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, GHMC కమీషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతమహంతి, నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్, సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్, వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ ఇలా అధికారులు అందరూ ప్రజల్లో అవగాహన, కరోనా మహామ్మారి ప్రమాదకరమైన వైరస్ విషయాన్ని ప్రచారంతో పాటు అరికట్టే అంశాలను పర్యవేక్షిస్తున్నారు.