తెలంగాణ రాష్ట్రానికి ప్రతిష్టాత్మక ఐఐఎం, ఐఐఎస్ఈఆర్ కేటాయించాలని హెచ్ఆర్డీ మంత్రిని కోరాం : అరవింద్

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి ప్రతిష్టాత్మక ఐఐఎం, ఐఐఎస్ఈఆర్ కేటాయించాలని హెచ్ఆర్డీ మంత్రిని కోరాం హెచ్ఆర్డీ మంత్రి చాలా సానుకూలంగా స్పందించారు

పార్లమెంట్ సమావేశాల చివరి రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశాం

తెలంగాణలో తర్వాత ఏర్పడేది బీజేపీ సర్కారేనని కేంద్ర నాయకత్వం నమ్ముతోంది

క్షేత్రస్థాయిలో సమాచారం లేకుండా మోదీ ఏదీ మాట్లాడరు

తెలంగాణలో ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారు

పసుపు రైతులకు జనవరిలో శుభవార్త తెలియజేస్తాం

పసుపు బోర్డును మించిన ప్రయోజనాలు కల్పించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది

పసుపు దిగుమతి నిలిపేయాలని కోరాం. కేంద్రం సానుకూలంగా ఉంది

పసుపు జాతీయస్థాయిలో సాగుచేసే పంట కాదు

అయినా సరే పసుపు పంటకు మద్ధతు ధర కల్పించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది

అయితే ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు రావాలి

ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం పసుపు మద్ధతు ధరపై ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదు