రక్షక భటుల రక్షణ కవచం…డిసీన్ఫెక్టాంట్ టన్నెల్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహామ్మారి కట్టడిలో TS రక్షక భటుల సేవలు చిరస్మరణీయమైనవి. కేంద్ర రాష్ట్ర ఒరభుత్వాల8ప్రకటనతో లాక్ డౌన్ అమలు కోసం 24/7 రోడ్లపై మండుటెండలో కంటికి కనబడని సూక్ష్మజీవితో యుద్ధంలో ఆహార్నిశలు పోరాడుతున్నారు. సామాజిక దూరం పాటించాలని కఠినంగా చర్యలు అమలు చేసే సందర్భరంలో ఖాకీల రక్షణకు ఎలాంటి అవాంతరాలు కలగకుండా, పోలీసులు వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తెలంగాణ పోలీసు ట్రాన్స్ పోర్టు విభాగం వినూత్నంగా మొబైల్ REST ROOMS-డిసీన్ఫెక్టాంట్ టన్నెల్ on Wheelsపై ఆవిష్కృతం చేసారు.

రాత్రి పగలు తేడా లేకుండా సమాజ రక్షణే లక్ష్యంగా కరోనా మహామ్మారి నుంచి రక్షించేందుకు కృషి చేస్తోన్న పోలీసులకు ఈ ఆవిష్కరణను తెలంగాణ పోలీసు1ఉన్నతాధికారులు అంకితం చేసారు.

తెలంగాణ స్టేట్ పోలీస్ ట్రాన్స్ పోర్ట్ ఆర్గనైజేషన్ ఆముదా రాజేష్ ఆశ్వర్యంలో అతని టెక్నీకల్ టీం ఈ డిసీన్ఫెక్టాంట్ టన్నెల్ రూపొందించారు.