జంట నగరాల్లో మొబైల్ రైతు బజార్లు

కరోనా వైరస్ ప్రబలకుండా లాక్ డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో 261 మొబైల్ రైతుబజార్లతో ఈ రోజు జంటనగరాలలో 516 ప్రాంతాలలో కూరగాయలు, 13 మొబైల్ రైతుబజార్లతో పండ్లు ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్లడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.

– కాలనీల వాసులు కలిసికట్టుగా సమన్వయం చేసుకుని సమాచారం ఇవ్వాలి
– కరోనా వైరస్ ప్రబలకుండా లాక్ డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో 261 మొబైల్ రైతుబజార్లతో ఈ రోజు జంటనగరాలలో 516 ప్రాంతాలలో కూరగాయలు, 13 మొబైల్ రైతుబజార్లతో పండ్లు ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్లడం జరిగింది
– రైతుబజార్లలో ప్రత్యేకంగా బత్తాయి (మోసంబి) కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది
– ప్రజలకు కూరగాయలు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాటుచేసిన ఫోన్ నంబరుకు 221 ఫోన్ కాల్స్ వచ్చాయి
– కొత్తగా 36 కాల్స్ వివిధ రెసిడెన్షియల్ కాలనీలు, అపార్ట్ మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల నుండి వచ్చాయి .. వారికి రేపు కూరగాయలు అందుబాటులో ఉంచడం జరుగుతుంది
– 12 కాల్స్ మొబైల్ రైతు బజార్లు నిర్వహిస్తామని ఉత్సాహవంతుల నుండి వచ్చాయి
– మాకూ కూరగాయలు పంపించండని ఆంధ్రాలోని కృష్ణా, గుంటూరు నుండి కాల్ సెంటర్ కు 20 వరకు ఫోన్లు
– వ్యక్తిగతంగా కూరగాయలు పంపించాలని 20 కాల్స్
– అన్నిరకాల కూరగాయలు ప్రభుత్వం అందుబాటులో ఉంచింది
– ధరలు అదుపులోనే ఉన్నాయి ఆలుగడ్డ, ఉల్లిగడ్డ కొరత లేదని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.