ఇంటికో కోడి-పది కోడిగుడ్లు ఏంటంటారా???

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా గుంతపల్లిలో ప్రజలకు ఉచితంగా స్థానిక సర్పంచ్ పడమటి సుమిత్ర శరీర దారుడ్యం కోసం కొత్తగా ఆలోచించారు. గ్రామంలోని 450 కుటుంబాలకు ఇంటికో కోడి-పది కోడిగుడ్లు పంపిణీ చేసారు. గతంలో ఒక వారం కూరగాయలు, తరువాత పది రోజులకు సరిపడా కూరగాయలు, నిత్యావసరాలు ఉచితంగా పంపిణీ చేసారు. అలాగే మాస్కులు, శానిలైజర్లు ఇంటింటికీ ఉచితంగా పంపిణీచేసి గ్రామస్తుల ఆరోగ్యమే ముఖ్యమని, కరోనా విపత్కర పరిస్థితులలో ప్రజలకు అండగా నిలవడం బాధ్యత అని భావించి సాయం చేస్తున్నట్లు వెల్లడించారు.

గ్రామస్తులు గడప దాటకుండా కరోనా కట్టడికి సహకరించాలని వినతి చేస్తూనే శనివారం ఇంటింటికీ కోడి, 10 కోడిగుడ్లు పంపిణీ పూర్తి చేశారు.