సర్వ రోగ నివారిణి FREE టెలి మెడిసిన్.

నాడు YSR ఆరోగ్య శ్రీ – నేడు FREE టెలి మెడిసిన్ ప్రజల ఆరోగ్యమే శ్రీరామ రక్షగా YS జగన్మోహన్ అడుగులు వేస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా దేశాలకు దేశాలే సరిహద్దు మూసుకోవాల్సి వచ్చింది. కనీసం పక్కింటి వాళ్లతో మాట్లాడాలంటేనే గజగజ వణుకుతోన్న రోజులివి.

మన దేశంలో కరోనాకు చికిత్స అందించే ప్రత్యక్ష దేవుళ్లు వైద్యులైతే ఊపిరి సలపనంత బిజీగా ఉంటున్నారు. ఇతర వ్యాధులకు చికిత్స చేసే ఆసుపత్రులు-వైద్యులు ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఇతర వ్యాధులతో భాధపడే రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అందుకే వైద్య
సహయార్ధం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం YSR టెలిమెడిసిన్
విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్
నాడు-నేడు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రజలకు అందుబాటులోకి శాశ్వతంగా తీసుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమైన వారం రోజుల్లోనే అనూహ్య స్పందన లభిస్తోంది. కేవలం ఏడంటే ఏడే రోజుల్లో దాదాపు 10 వేల మంది చికిత్స చేయించుకున్నారు. దీర్ఘకాలికంగా ముఖ్యంగా కిడ్నీ, గుండె, బిపి, షుగర్ వ్యాధులతో వేలాది లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ వ్యాధిగ్రస్తులకు పర్యవేక్షణ, చికిత్స, మందులు అందుబాటులో ఉండటం అత్యంత అవసరం.

సర్వ రోగ నివారిణి టెలి మెడిసిన్.
సర్వ రోగ నివారిణి జిందా తిలస్మాత్ అనేది ఒకప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉండే నానుడి. ఇప్పుడు వ్యాధుల తీవ్రతను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్నామ్నాయ ఏర్పాట్లతో
YSR టెలీ మెడిసన్ సర్వరోగ నివారిణిగా ప్రసిద్ధికి ఎక్కుతుందని ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకుంటోన్న లబ్ధిదారులు అభిప్రాయబడుతున్నారు. రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ప్రజా రవాణా స్థంభించిన నేపధ్యంలో ఫోన్ ద్వారానే ప్రజలకు వైద్య సేవలు అందించడానికి ఏర్పాటు చేసిన 14410 టోల్ ఫ్రీ నెంబర్ గత వారం రోజుల్లో 9697 రోగులు చికిత్స చేయించుకోవడం విశేషం.

టెలి మెడిసిన్ అమలు ఎలా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యవసరమైన 4732 మందికి సంబంధిత డాక్టర్లు టెలీ మెడిసిన్ పద్ధతిలో తమ సేవలను అందించారు. సమస్య పరిష్కారానికి అవసరమైన మందుల సమాచారాన్ని అందజేశారు. 14410 నెంబరుకు ఫోన్ చేయగానే డాక్టర్లు ఫోన్ ద్వారానే సలహాలు ఇవ్వడంతో పాటు అవసరమైన మందుల వివరాలను ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలోని మెడికల్ ఆఫీసర్ వ్యవస్థకు సమాచారమిస్తున్నారు.

అక్కడి నుంచి మందులను అవసరాన్ని బట్టి పేషెంట్
ఇంటికే సరఫరా చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. వైద్య సేవలు కావాల్సిన వ్యక్తులు (ఆకతాయిలు కాకుండా) 14410కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు, డాక్టర్ ఫోన్ చేసి ఆరోగ్య వివరాలను అడిగి తీసుకుంటారు. ఆ వ్యక్తికి ఓ గుర్తింపు సంఖ్యను ఇస్తారు. డాక్టరు రోగిని అన్ని విధాలుగా పరీక్షించిన తర్వాత వ్యాధి క్షణాకు అనుగుణంగా మందును సూచిస్తున్నారు. ఈ మందులను (డోర్ డెలివరీ) ఇంటి వద్దకే తీసుకెళ్లి ఆశా
కార్యకర్త-ANMతో అనుసంధానం చేసి సంబంధిత వాలంటీర్ ద్వారా ఆ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి మందులను ప్రత్యేక ప్యాకులతో అందజేస్తున్నారు.

కరోనా కేసుల గుర్తింపు
టెలి మెడిసిన్ సాధనంగా ఇతర వ్యాధులతో పాటు కరోనా కేసులను కూడా వైద్యులు గుర్తిస్తున్నారు. ఇప్పటివరకు 119 మందిని ఈ వైరస్ మహామ్మారి బారిన పడినట్టుగా ఒక్కరోజే కర్నూల్, గుంటూరు,తూర్పుగోదావరి, కడప జిల్లాల్లో 10 మందిని గుర్తించారు. ఈ విధానంతో డాక్టర్ YSR టెలికాన్ఫరెన్స్ సామాన్య ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోంది.

టెలిమెడిసిన్ విధానం అద్భుతహ.
రాష్ట్రంలో కరోనా ముఖ్యంగా కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తరిస్తుండడంతో ఆయా జిల్లాల్లో ఆసుపత్రులు మూతపడటంతో కరోనా కాకుండా ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు సరైన చికిత్స పొందలేక పోతున్నారు. రాష్ట్రంలో 59101 మందికి వైద్యం అందించగా.
అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాల్లో 6372 మొదటి స్థానం, అనంతపురం 6039తో రెండవ స్థానంలోన్నది. ఆరోగ్య చికిత్సలు, రోగాల వారీగా పరిశీలిస్తే గర్భిణులు 16311 మందికి చికిత్స అందిస్తే నిన్న (ఏప్రిల్ 24) ఒక్క రోజే 339 మందికి చికిత్స చేశారు. రెస్పిరేటరీ థెరపీ (ఆర్టి) అంటే ఊపిరితిత్తుల సమస్యలు, ఆస్తమా మొదలైన జబ్బలతో బాధపడుతున్న 4060 మందిని ఆదుకున్నారు. విషం బారిన పడినవారు 1146 మంది చికిత్స పొందారు. ముఖ్యమైన రోగాలైన కిడ్నీ బాధితుల్లో 353 మందికి డయాసిస్ హృద్రోగంతో బాధపడుతున్న వ్యక్తులు 1330 మందికి అత్యవసర చికిత్సను అందించారు. ఇందులో భాగంగా అవసరమైన అంబులెన్సును కూడా సిద్ధంగా వుంచారు. కరోనా రోగులను తీసుకువెళ్లేందుకు ఉపయోగిస్తున్న అంబులెన్సును ఇక్కడ రోగుల కోసం ఉపయోగించడం లేదు. కోవిడ్ ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే అవకాశం వున్నందున అంబులెన్సు విషయంలో కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నది.

దేశంలో No1 కరోనా పరీక్షల్లో…

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే అధిక సంఖ్యలో (ప్రతి మిలియన్ జనభా లెక్కలోకి తీసుకుంటే) అత్యధికంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 25వ తేదీ నాటికి 61266 పరీక్షలు నిర్వహించగా అందులో 1016 కోవిడ్ బాధితులుగా గుర్తించారు. వీరిలో 31 మంది మరణించగా 171 మందికి మెరుగుపడటంతో (నెగెటివ్) ఆసుపత్రుల నుంచి ఇళ్లకు పంపించేశారు.

రాష్ట్రంలో సర్వైలెన్స్, రాపిడ్ టెస్టింగ్ అధికంగా ఉన్నందున (మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే) పాజిటివ్ కేసులు కూడా బయటపడుతున్నాయనేది ఓ అంచనా. మొత్తం 1016 కేసులకు గానూ 335 ప్రైమరీ, 119 సెకండరీ కేసులున్నాయి. మరో 64 కేసులు ఏ రకమైనవి అనేది ఇంకా నిర్ధారణ కావాలి. మిగిలిన ష్ట్రాలతో పోలిస్తే ఏపీలో సెకండరీ కేసులు తక్కువగానే నమోదవడం ఉపశమనం కలిగించే అంశం.

✒️సంకు విశ్వేశ్వర రావు.