APలో శాశ్వతంగా టెలి మెడిసిన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ కోవిడ్‌-19 నివారణ చర్యల సమీక్షలో శాశ్వతంగా టెలి మెడిసిన్ ప్రజలకు రాష్ట్రంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

టెలి మెడిసిన్‌ వ్యవస్థను శాశ్వత ప్రాతిపదికన నడపాలని, ఫోన్ చేసిన వ్యక్తులకు మందులు ఇవ్వడమే కాకుండా ప్రజలకు రక్షణ అంశాలపై అవగాహన కల్పించాలని అన్నారు. టెలి మెడిసిన్‌ నిర్వహణకు 14410కు మరింత ప్రచారం కల్పించాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి సామాజిక దూరం పాటిస్తూ అనుమతించిన ప్రాంతాల్లో పరిశ్రమలు, ఇతర వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.