తెలంగాణలో SSC పరీక్షలు వాయిదా

తెలంగాణలో SSC పరీక్షలు వాయిదా

తెలంగాణ రాష్ట్రంలో గురువారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఐతే కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలు కొనసాగించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అత్యవసర వ్యాజ్యంగా భావించి ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వణికిస్తున్న తరుణంలో పరీక్షలు కొనసాగించడం సమంజసం కాదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది పవన్‌ కుమార్‌ వాదించారు. విద్యార్థులు కూడా ప్రశాంతంగా చదవలేని గందరగోళ పరిస్థితులు ఉన్నందున పరీక్షలు వాయిదా వేయాలని లేదా పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ అంశంపై వాదనలు విన్న న్యాయస్థానం సోమవారం నుంచి ఈనెల 30 వరకు నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కరోనా అలెర్ట్ లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్