సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ ఛారిటీ

అందరి చేయి చేయి కలిస్తేనే సినిమా పూర్తి అవుతుంది. అందుకే మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సినీ పరిశ్రమ ఓఅడుగు ముందుకు వేసింది. సినీ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు నిర్వహించాలని ఓ కమిటీని ఏర్పాటు చేసారు. ఈ ఛారిటీతో సినీ పరిశ్రమలో కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయిన వాళ్లందరికీ విపత్తు సహాయం అందించనున్నారు. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, Jr ఎన్టీఆర్ హీరోలు సహాయ నిధికి విరాళాలు ఇచ్చారు. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్. శంకర్ మాట్లాడుతూ వేలాది మంది కార్మికులకి అండగా నిలబడాలనే కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సినిమా పరిశ్రమలోని అన్ని విభాగాలకు చెందిన నటీనటులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలిపారు. -GJ Narasimha