కరోనాలో మా వంతు సహాయం

ఢిల్లీలో ఉభయ రాష్ట్రాల ఎంపీలతో సెక్రటరీలుగా పని చేస్తోన్న తెలుగు వ్యక్తులు కరోనా సమయంలో సహాయం చేసేందుకు మేమున్నాం అంటూ ముందుకు వస్తున్నారు.

ఒకరికికొకరు చందాలు వేసుకుని రోడ్లపై నివసిస్తోన్న నిరుపేదలకు నిత్యావసర సరుకులు, ఆహార్నిశలు రోడ్లపై సామాజిక దూరం పాటించాలని పాటుబడుతోన్న పోలీసులకు కావాల్సిన ఆహార పానీయాలు అందిస్తున్నారు.

గత మూడు రోజులుగా బియ్యం, పప్పులు, కూరగాయలు అందిస్తూ తమ వంతుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.

ఢిల్లీలో గత ఇరభై ఏళ్లుగా స్థిరపడిన సీనియర్ PS శ్రీకాంత్ తెలుగు మిత్రులతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు పూనుకున్నారు. అలాగే మిగతా తెలుగు PSలు కూడా ఆర్థికంగా సహాయం చేయడంతో గత మూడు రోజులుగా కరోనాలో సహాయం అత్యవసరమైన కుటుంబాలకు నిత్యావసరాలు అందిస్తున్నారు.