జమ్మూకాశ్మీర్ మొబైల్ ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా నిలిపివేత

జమ్మూ కాశ్మీర్ అవంతిపోరాలో ఎన్‌కౌంటర్ జరుగుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలో భాగంగా ఈ రోజు కాశ్మీర్ లోయలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ప్రతి ఏడాది ఏప్రిల్, మే నెలలో PoK నుంచి మన భారతదేశంలోకి అక్రమంగా ఉగ్రవాదులను పొరుగు దేశం చొరబడేలా ప్రయత్నాలు చేస్తుంది. మన భారాతీయ సైన్యం ఎప్పటికప్పుడు పొరుగు దాయాది దేశం ఉగ్ర కుట్రలను భగ్నం చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే గత 10 రోజులుగా కాశ్మీర్ లోయలో వాతావరణం వేడెక్కింది.