నేను మీలా వచ్చినదాన్ని కాదు: సీఎం ఉద్ధవ్‌కు హీరోయిన్ కంగన కౌంటర్

నేను మీలా వచ్చినదాన్ని కాదు: సీఎం ఉద్ధవ్‌కు హీరోయిన్ కంగన కౌంటర్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వారసత్వం ద్వారా వచ్చిన ఓ చెత్త ఉత్పత్తి అంటూ హీరోయిన్ కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు గుప్పించింది. నిన్న కంగనపై ఉద్ధవ్ థాకరే పరోక్ష విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఆమె మళ్లీ ఆయనకు కౌంటర్ ఇచ్చింది. ఉద్ధవ్ తనను నమ్మక ద్రోహి అని అన్నారని, ముంబై తనకు షెల్టర్ ఇవ్వకపోతే తనకు తిండి కూడా దొరకదని అన్నారని ఆమె చెప్పింది. తనకు ఉద్ధవ్ థాకరే కొడుకు వయసుంటుందని, కానీ, తాను సొంత టాలెంట్‌తో ఎదిగిన ఒంటరి మహిళనని, తన గురించి ఉద్ధవ్ థాకరే మాట్లాడిన తీరు చూస్తోంటే సిగ్గేస్తోందని చెప్పింది.ఉద్ధవ్ థాకరేలా తాను తండ్రి అధికారం, డబ్బును అడ్డుపెట్టుకునే తాగుబోతును కాదని చెప్పింది. తాను వారసత్వాన్ని నమ్ముకుని ఉంటే హిమాచల్ ప్రదేశ్‌లోనే ఉండేదాన్నని చెప్పారు. అయితే, తాను కూడా ఓ ఘనమైన వారసత్వం ఉన్న కుటుంబం నుంచే వచ్చానని, కానీ, తాను ఆ వారసత్వం మీద, సంపద మీద ఆధారపడదలచుకోలేదని చెప్పింది. కొంతమందికి ఆత్మగౌరవం ఉంటుందని చెప్పింది.