కరోనాతో పోరాటంకు ప్రోటీన్ బిస్కెట్లు

మైసూరుకు చెందిన CSIR- సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అధిక ప్రోటీన్ గల బిస్కెట్లను అందుబాటులోకి తెచ్చింది. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్)లో చికిత్స పొందుతున్న కోవిడ్ -19 రోగుల కోసం వీటిని తయారు చేశారు. రోగులకు సరఫరా చేసేందుకు CFTRI ఎయిమ్స్ డైటెటిక్స్ విభాగానికి 500 కిలోల అధిక ప్రొటీన్ బిస్కెట్లు మరియు 500 కిలోల అధిక ప్రొటీన్ రస్క్ లను సరఫరా చేసింది. ఇనిస్టిట్యూట్ అధికారుల అభ్యర్థన మేరకు బిస్కెట్లు సరఫరా చేశారు. సాధారణ బిస్కెట్లలో 8 నుంచి 9 శాతం ప్రొటీన్ ఉంటే ఈ బిస్కెట్లలో 14 శాతం ప్రొటీన్ ఉంటుంది. ఈ బిస్కెట్లు రోగులు తిరిగి ఆరోగ్యాన్ని పొందడానిక అవసరమైన ప్రొటీన్లను అందిస్తాయని CSIR-CFTRI. డైరక్టర్ డాక్టర్ కె.ఎస్.ఎం.ఎస్. రాఘవరావు తెలిపారు.

సుసంపన్నమైన ప్రొటీన్ ఉన్న ఈ బిస్కెట్ రెసిపీని సి.ఎస్.ఐర్ – సి.ఎఫ్.టి.ఆర్.ఐ, మైసూరు శాస్త్రవేత్తలు తయారు చేశారని, ఇది ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. నిబంధన ప్రకారం తయారు చేస్తున్నారని ఎయిమ్స్ చీఫ్ డైటీషియన్ డాక్టర్. పర్మీత్ కౌర్ తెలిపారు. కోవిడ్ రోగులతో పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇతరులకు సాధారణ ఆహారంలో భాగంగా బిస్కెట్లను అందిస్తున్నారు.

గోధుమ పిండి (ఆటా), గోధుమ పిండి (మైదా), చక్కెర, హైడ్రోజనేటెడ్ కొవ్వు, సోయా పిండి, వే ప్రొటీన్, సోయా ప్రొటీన్, పాల ఘనపదార్థాలు, గ్లూకోజ్, ఐ.ఎన్.ఎస్. 500 II మరియు ఐ.ఎన్.ఎస్. 503 II ఏజెంట్లు, రుచి కోంస ఉప్పు ఈ బెస్కెట్ల తయారీలో వాడతారు. 100 గ్రా బిస్కెట్ ప్యాకెట్లలో 400 కిలో కాలరీలు మరియు పోషక విలువలు ఉంటాయి. కార్బొహైడ్రేట్స్ (63.2 గ్రా), ప్రొటీన్ (14 గ్రా), కొవ్వు (17.1 గ్రా) మరియు ఖనిజాలు (1.2 గ్రా) ఇందులో ఉంటాయి.

సి.ఎస్.ఐ.ఆర్ – సి.ఎఫ్.టి.ఆర్.ఐ. అభివృద్ధి చేసిన సూత్రీకరణ ఆధారంగా సెవెన్ సీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారిచే ఉత్తర ప్రదేశ్ లోని నోయిడాలో బిస్కెట్లు తయారు చేస్తున్నారు. నిరుపేదలకు సరఫరా చేసేందుకు లాజిస్టిక్స్ ను న్యూఢిల్లీలోని ఇండియన్ సొసేటీ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొఫెషనల్స్ అందిస్తున్నాయి.