కేంద్రం రాష్ట్రాలకు 17,287నిధులు విడుదల

కేంద్ర సర్కారు కరోనా వైరస్‌ పోరాటంపై రాష్ట్రాలు మరింత సమర్ధవంతంగా పోరాడేందుకు 17,287 కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దేశంలోని 14 రాష్ట్రాలకు 15వ ఆర్థిక సంఘం ఆదేశాలతో ఆదాయలోటు గ్రాంటు 6195 కోట్లు కలుపుకుని అందజేసింది. అస్సాం, ఆంధ్రప్రదేశ్, హిమచల్‌ ప్రదేశ్‌, కేరళ, మణిపూర్‌, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్‌, పంజాబ్‌, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకు ఆర్థిక శాఖ నిధులు మంజూరు చేసింది. అలాగే SDRMF తొలి వాయిదాలో ప్రతి రాష్ట్ర వాటా కలుపుకుని మొత్తంగా 11,092 కోట్లు విడుదల చేసిన విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.