నాడు-నేడు ప్రజల సంక్షేమమే లక్ష్యం: సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్‌ నాటికి పాఠశాలల్లో పనులు పూర్తయ్యేలా తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ తయారుచేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని స్కూళ్లలో ఫర్నిచర్, చాక్‌ బోర్డ్స్‌ తదితర వాటికి దాదాపుగా టెండర్లు పూర్తి చేయాలన్నారు. మిగిలిన ఒకటి రెండు అంశాలకు సంబంధించి కూడా త్వరలోనే ప్రక్రియను పూర్తిచేస్తామని అధికారులు సీఎం దృష్టికి తీసుకు వెళ్లారు.

ఈ సమీక్ష సమావేశంలో చర్చించిన అంశాలు పరిశీలిస్తే 72,596 గ్రీన్‌ చాక్‌ బోర్డ్స్‌ కోసం రివర్స్‌ టెండర్లలో రూ.5.07 కోట్లు ఆదా, 79.84 కోట్లు టెండర్లలో ఎల్‌–1 కోట్‌చేస్తే.. రివర్స్‌ టెండర్లలో రూ. 74.77 కోట్లుగా ఖరారు, అలాగే 16,334 అల్మరాల కోసం రూ.19.58 కోట్లకు ఎల్‌–1 కోట్‌ చేస్తే, రివర్స్‌ టెండర్లలో రూ.15.35కు ఖరారైందని, తద్వారా రూ. 4.23 కోట్లు ఆదా చేసిన విషయం అధికారులు సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. రాష్ట్రంలో స్కూలు పిల్లలకు ఇవ్వనున్న యూనిఫారమ్స్, స్కూలు బ్యాగు నమూనాలను పరిశీలించిన సీఎం జగన్ నాణ్యంగా ఉండాలని ఆదేశించారు.