మహిళా సాధికారతే లక్ష్యం.. AP CM జగన్..

కరోనా విపత్తు సమయంలో మహిళలకు కొండంత అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని AP సీఎం జగన్మోహన్ అన్నారు. మహిళా సంఘాలకు సున్నా వడ్డీ కింద రూ.1400 కోట్లు విడుదల చేసారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బటన్‌ నొక్కి ఖాతాల్లోకి సున్నా వడ్డీ కింద డబ్బును సీఎం YS. జగన్‌ పంపారు. కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో స్వయంసహాయక సంఘాల మహిళలు, కలెక్టర్లు హాజరయ్యారు. 2016 నుంచి సున్నా వడ్డీ పథకం నిలిచిపోయింది, మొట్టమొదటిగా మాజీ ముఖ్యమంత్రి YS రాజశేఖర్ రెడ్డి పావలా వడ్డీకే రుణాలు పధకం తీసుకు వచ్చారు. రూపాయి పైచిలుకు ఉన్న రుణాలను పావలా వడ్డీకే నాన్నగారు తీసుకు వస్తే ఆ పథకం తర్వాత సున్నా వడ్డీగా మారింది.

2016లో పథకాన్ని పూర్తిగా ఎత్తివేశారు

మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో వైయస్సార్‌ సున్నా వడ్డీ పథకం ప్రారంభిస్తున్నాం. అక్కచెల్లెమ్మలు అందరికీ రూ.1400 కోట్లు ఈ పధకం కింద ఇవ్వగలగులుతున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. కరోనా వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా, రావాల్సిన ఆదాయం రాని పరిస్థితులు ఉన్నా.. ఇలాంటి పరిస్థితుల్లోనే అక్కచెల్లెమ్మలకు ఈ పథకం తీసుకురావడం వల్ల కాస్తో కూస్తో మేలు జరుగుతుందని అనుకుంటున్నాం.

8లక్షల 78వేల గ్రూపులకు ఈ పథకం ద్వారా 91లక్షలమంది అక్కచెల్లెమ్మలకు మేలు జరుగుతుంది. ప్రతి గ్రూపునకు కనీసం రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకూ ఈపథకం వల్ల మేలు జరుగుతుంది. ప్రతి ఏటా ఈ కార్యక్రమం ద్వారా ఆమేరకు లబ్ధి పొందుతారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు బ్యాంకులు రూ.3లక్షల పరిమితి వరకూ ఆరు జిల్లాల్లో 7 శాతం వడ్డీకి రుణాలు ఇస్తున్నారు. మిగిలిన 7 జిల్లాల్లో డ్వాక్రా సంఘాలకు 11 నుంచి సుమారు 13 శాతం వరకూ వడ్డీ భారం వేస్తున్నారు. సున్నా వడ్డీ అమలు చేయాలంటే 7శాతం నుంచి 13 శాతం వరకూ ఉన్న వడ్డీని ప్రభుత్వమే చెల్లించాలి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి గ్రూపునకూ 7శాతం వడ్డీ నుంచి 13.5శాతం వడ్డీని ప్రభుత్వమే చెల్లించాలి. సగటున ప్రతి గ్రూపునకురూ.20 వేల నుంచి రూ.40 వేల వరకూ లబ్ధి చేకూరుతుంది. దీనివల్ల పొదుపు సంఘాలకు మరింత మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం. మనం చేసే ప్రతి పథకంలోకూడా అక్కచెల్లెమ్మలకే పెద్దపీటే వేశాము. మన ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ముగ్గురు మహిళా మంత్రులు కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, ఇద్దరు మంత్రులు, సీఎస్‌ స్థానాల్లో మహిళలు ఉన్నారు.

తల్లుల చేతిలో అక్కచెల్లెమ్మల చేతిలో డబ్బులు పెడితే పూర్తిగా సద్వినియోగం అవుతుందని నా భావన అన్నారు. ఫలితాలు బాగుండాలి, ప్రతి పైసా సద్వినియోగం అవుతుందని భావిస్తున్నాం. 82 లక్షలమంది పిల్లలకు మేలు జరిగేలా అమ్మ ఒడి పథకం. పిల్లల చదువులు బాగుండాలనే ఉద్దేశంతో నాడు- నేడు కింద స్కూళ్లలో కార్యక్రమాలు.

కరోనా లేకపోతే అక్షరాల 27 లక్షల ఇళ్లపట్టాలు రిజిస్ట్రేషన్‌ అయ్యేవి. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. నాన్నగారి పుట్టినరోజున జులై 8న ఈ కార్యక్రమం చేయాలని భావిస్తున్నాం. జులై 8న ఈ 27 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇవ్వాలని నిర్ణయించాం. ఇళ్లపట్టాలు ఇవ్వడమే కాదు, ఉచితంగా ఇళ్లు కూడా కట్టిస్తాం. నామినేటెడ్‌ పనులు, నామినేటెడ్‌ పదవులు 50శాతం అక్క చెల్లెమ్మలకే ఇవ్వాలని గొప్ప చట్టం తీసుకు వచ్చాం. వక్ర బుద్ధితో అక్క చెల్లెమ్మల వైపు చూస్తే.. కఠినంగా శిక్షలు వేసేలా దిశ చట్టాన్ని తీసుకువచ్చాం. త్వరలో రాష్ట్రపతిగారు దీనికి ఆమోదం తెలుపుతారని ఆశిస్తున్నాం. 13 దిశ పోలీస్‌స్టేషన్లను, జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు తీసుకు వచ్చాం.

ప్రత్యేక యాప్‌కూడా కూడా తీసుకు వచ్చాం.

ప్రతి గ్రామ సచివాలయంలో కూడా ఒక మహిళా పోలీసును పెట్టాం. 11వేలకుపైగా మహిళా పోలీసులను రిక్రూట్‌ చేసి ఉద్యోగాలు ఇవ్వగలిగాం. గ్రామ సచివాలయాల్లో 7–8 మంది మహిళా మిత్రలను ఏర్పాట చేయడం జరిగింది. బెల్టుషాపులు ఉన్నా, గృహహింస జరిగినా.. వెంటనే తగిన చర్యలు తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. వసతి దీవెన అని ఈ మధ్య కాలంలో 12 లక్షలమందికి మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకున్నాం. డిగ్రీ, ఇంజినీరింగ్‌ లాంటి చదువులు చదివేవారికి రెండు దఫాల్లో వసతి దీవెన కింద తల్లుల అక్కౌంట్లో వేయగలుగుతున్నామని చెప్పగలుగుతున్నాం. ఎప్పుడూ కనివినీ ఎరుగని విధంగా గత ప్రభుత్వం పెట్టిన మొత్తం ఫీజు రియంబర్స్‌మెంట్‌.. ఇవ్వడమే కాకుండా, ఈ మంగళవారం నాడు మార్చి 31 వరకూ ఉన్న బకాయిలను పూర్తిగా చెల్లిస్తాం.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి మూడు నెలలకు సంబంధించి పీజు రియింబర్స్‌మెంట్‌ను నేరుగా తల్లుల అక్కౌంట్లోకి వేస్తాము. తమ పిల్లలు ఎలా చదువుతున్నారు? కాలేజీల్లో మౌలికసదుపాయాలు ఎలా ఉన్నాయి అని తల్లులు చూసుకుని ఆ ఫీజులు చెల్లిస్తారు. జవాబుదారీ తనంకోసమే ఇలా చేస్తున్నాం. రాబోయే కాలంలో ఇంకా మంచి పనులు చేయడానికి దేవుడి దీవెనలు ఉండాలని కోరుతున్నానని ముఖ్యమంత్రి జగన్మోహన్ అభిప్రాయబడ్డారు.