దాసరికి ప్ర‌భుత్వ‌ గుర్తింపు రాక‌పోవ‌డం ఒక తీర‌ని లోటన్న చిరు

దాసరికి ప్ర‌భుత్వ‌ గుర్తింపు రాక‌పోవ‌డం ఒక తీర‌ని లోటన్న చిరు

ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ రావుకి ప‌ద్మ పుర‌స్కారం ఇవ్వాల‌ని మెగాస్టార్ చిరంజీవి కేంద్ర ప్ర‌భుత్వానికి ట్విట్ట‌ర్ ద్వారా విజ్ఞ‌ప్తి చేశారు. దాస‌రి నారాయ‌ణరావు గారి జయంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు త‌న‌ స్మృత్యంజ‌లి అంటూ మెగాస్టార్ చిరంజీవి ఓ ట్వీట్ చేశారు.’విజ‌యాలలో ఒక‌దానికి మించిన చిత్రాల‌ను మరెన్నో త‌న అపూర్వ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌తో మ‌ల‌చ‌డ‌మే కాదు.. నిరంత‌రం చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఆయ‌న చేసిన కృషి ఎప్ప‌టికీ మార్గ‌ద‌ర్శ‌క‌మే. శ్రీ దాస‌రికి ఇప్ప‌టికీ త‌గిన ప్ర‌భుత్వ‌ గుర్తింపు రాక‌పోవ‌డం ఒక తీర‌ని లోటు’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. ఆయన‌కు ఇప్ప‌టికైనా (మ‌ర‌ణానంత‌రం) విశిష్ట‌మైన ప‌ద్మ పురస్కారం ద‌క్కితే అది మొత్తం తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ద‌క్కే గౌర‌వం అవుతుంద‌ని విజ్ఞ‌ప్తి చేశారు.