ల్యూట్ తాబేలు తీరానికి వచ్చింది

సముద్రంలో తిరిగి బోరు కొట్టిందో ఏమో భారీ లెద‌ర్ బ్యాక్ తాబేలు తీరానికి వ‌చ్చింది. సుమారు 10 అడుగులున్న ఈ తాబేలు కొద్ది సేపు తీరంలో సేద తీరింది. ఇక ఆ త‌ర్వాత మెల్ల‌మెల్ల‌గా త‌న ఆవాసమైన‌ సముద్రంలోకి వెళ్లిపోయింది. తాబేలు స‌ముద్రంలోకి వెళ్తుండ‌గా అక్క‌డున్న ఓ వ్య‌క్తి వీడియో తీశాడు. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుసంత నందా ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు. భూమి మీదున్న అతిపెద్ద తాబేళ్ల‌లో లెద‌ర్ బ్యాక్ తాబేలు కూడా ఒక‌టి. దీన్ని ల్యూట్ అని కూడా పిలుస్తుంటారు.