కొలువుదీరుతున్న కొత్త పాలకవర్గాలు

కొలువుదీరుతున్న కొత్త పాలకవర్గాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కోలాహలంగా జరుగుతోంది. 11 నగర పాలక సంస్థల్లో మేయర్, 75 పురపాలక, నగర పంచాయతీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది.ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ మరికాసేపట్లో ముగియనుంది. కాగా, నగర పాలక సంస్థల్లో అదనంగా మరో ఉప మేయర్, పురపాలక సంఘాల్లో మరో వైస్ చైర్మన్ పదవుల కోసం ప్రభుత్వం ఆర్డినెన్స్ తేనుంది. వీటి ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఎస్ఈసీ మరో నోటిఫికేషన్ ఇవ్వనుంది.కాగా, 8 సంవత్సరాల తర్వాత కొత్త పాలకవర్గంతో జీవీఎంసీ కొలువుదీరింది. విశాఖ మేయర్‌గా గొలగాని హరి వెంకట కుమారి, డిప్యూటీ మేయర్‌గా జియ్యాని శ్రీధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరు మేయర్‌గా కావటి మనోహర్‌నాయుడు, డిప్యూటీ మేయర్‌గా డైమండ్ బాబు ఎన్నికయ్యారు.