స్నేహ ధర్మం ఇజ్రాయిల్ కోసం క్లోరోక్విన్

కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరులో మన స్నేహితులకు అవసరమైన సహాయం అందించడానికి భారతదేశం సిద్ధమని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు.

ఇజ్రాయెల్ దేశంకు క్లోరోక్విన్ సరఫరా చేయాలని భారతదేశం తీసుకున్న నిర్ణయం పట్ల తన కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చేసిన ట్వీట్ కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందిస్తూ ఈ హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ట్వీట్ చేస్తూ ఈ కరోనా మహమ్మారిని మనం కలిసి కట్టుగా తరిమి కొట్టాలి. మన స్నేహితులకు సాధ్యమైన ఏ సహాయం చేయడానికైనా భారతదేశం సిద్ధంగా ఉంది. ఇజ్రాయెల్ ప్రజల శ్రేయస్సు, మంచి ఆరోగ్యం కోసం ప్రార్ధిస్తున్నాము. ” అని సమాధానం ఇచ్చారు.