రజినికాంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

రజినికాంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు. దీనిపై స్పందించిన రజనీకాంత్ ట్విట్టర్ లో బదులిచ్చారు. గౌరవనీయ నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు అంటూ వ్యాఖ్యానించారు. ఎంతో సహృదయతతో మీరు తెలిపిన శుభాకాంక్షల పట్ల ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని పేర్కొన్నారు.కాగా, రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు చిరంజీవి, ఏఆర్ రెహమాన్, సచిన్ టెండూల్కర్ వంటి ప్రముఖులతో పాటు యావత్ భారత సినీ లోకం విషెస్ తెలిపింది. త్వరలో తలైవా రాజకీయ పార్టీ ప్రకటించనున్న నేపథ్యంలో అభిమానులు మరింత ఉత్సాహంగా ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించనున్నారు.