రాష్ట్రాల సరిహద్దులో చైనా గోడలా కట్టేశారు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా నుంచి తమిళనాడు వెళ్లే రహదారిని మూసి వేసారు. ఎలా మోసేసారో చూస్తే ఆశ్చర్యపోతారు. జనాలకు ఎంత చెప్పినా వినడం లేదని ఏకంగా నడి రోడ్డుపై తాత్కాలిక గోడను కట్టేసి నిఘా, పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. AP నుంచి తమిళనాడులోని రాయ వేలూరుకు వెళ్లే మార్గంలో ఈ ప్రహరీ గోడను నిర్మించారు.

కరోనా కారణంగా దేశమంతటా ఇప్పటికే అన్ని రాష్ట్రాల సరిహద్దులు మూసేసారు అంతేకాదండోయ్ దేశ సరిహద్దులనే మూసి వేయాల్సి వచ్చింది. లాక్ డౌన్ కొనసాగుతోండటంతో సామాజిక దూరం పాటించాలి, ఇంటికే పరిమితమవ్వాలని పిలుపు వస్తున్నప్పటికీ అక్కడక్కడ ప్రజలు లక్ష్మణ రేఖను దాటడం బాధాకరం.