చైనాలో కమలం ఫుట్ బాల్ స్టేడియం..

ప్రపంచమంతా కరోనాతో కకావికాలం అవుతుంటే డ్రాగన్
చైనాలో మాత్రం ఆటలను ప్రోత్సహించేందుకు ఆ దేశంలోని ఓ రియల్‌ ఎస్టేట్‌ గ్రూప్‌ ఎవర్‌ గ్రాండ్‌ అనే సంస్థ కమలం ఆకారంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్‌బాల్‌ స్టేడియం నిర్మించబోతున్నది.

ఈ కమలం స్టేడియం నిర్మాణం కోసం ఏకంగా దాదాపు
13వేల కోట్లు ఖర్చుచేయబోతున్నారు. లక్షమంది ప్రేక్షకులు సామర్థ్యంతో ఆటలను తిలకించేందుకు ప్రస్తుతం స్పెయిన్‌ దేశంలోని బార్సిలోనాలో అతిపెద్ద ఫుట్‌బాల్‌ స్టేడియం నిర్మించారు.

చైనా గ్వాంగుఝులో నిర్మించబోతోన్న స్టేడియం 2022 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చైనా ఫుట్‌బాల్‌ క్లబ్‌ గ్వంగాఝు ఎవర్‌ గ్రౌండ్‌ భవిష్యత్తులో హోం గ్రౌండ్‌ కానున్నది. ఈ కమలం స్టేడియం నిర్మాణ పనులు చేపట్టిన సంస్థ అధ్యక్షుడు సియా హుజేన్‌ ఓ అద్భుతమైన కట్టడం నిర్మించబోతున్నామనీ అభిప్రాయబడ్డారు.

డ్రాగన్ దేశంలో గ్వాంగాఝు ప్రాంతాన్ని సువాసనలు వెదజల్లే పూదోట నగరంగా అభివర్ణిస్తారు. అందుకే ఈ కట్టడాన్ని కమలం పువ్వులా ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. షాంఘైలోని అమెరికన్‌ డిజైనర్లు తుది మెరుగులు దిద్దుతున్నారు. దాదాపుగా మూడు లక్షల చదరపు మీటర్లలో 16 వీవీఐపీ రూములు,152 ప్రవేట్‌ రూములు, ఫీఫా సభ్యులు, అధ్లెట్ల కోసం సౌకర్యాలు, మీడియా రూములు, మైదానం కట్టడంలో నిర్మించనున్నారు.