ప్రపంచ బ్యాంకు భారతదేశంకు 7,630 కోట్లు

ప్రపంచం బ్యాంకు భారతదేశానికి 7,630 కోట్లు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఏడు ఖండాల్లో 25 అభివృద్ధి చెందుతోన్న దేశాల జాబితాలో కరోనా వైరస్ కట్టడి కోసం అత్యవసర సహాయనిధి నుంచి మనదేశానికి 1.9 బిలియన్ డాలర్లను విడుదల చేయనుంది. ఏప్రిల్ నాలుగవ తేదీ వరకు కరోనా పాజిటివ్ నమోదైన కేసులు 3100కు చేరగా, 86 మృత్యువాత పడ్డారు.

ఆసియా ఖండంలో దక్షిణ భాగంలోన్న దేశాలైన పాకిస్తాన్‌కు 200 మిలియన్ డాలర్లు, ఆఫ్ఘనిస్తాన్‌కు 100 మిలియన్ డాలర్లు, మాల్దీవులకు 7.3 మిలియన్ డాలర్లు, శ్రీలంకకు 128.6 మిలియన్ డాలర్లు ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది.