బాలయ్య .. బోయపాటి కాంబినేషన్లో మూడో సినిమా

బాలయ్య .. బోయపాటి కాంబినేషన్లో మూడో సినిమా

బాలకృష్ణ ‘అఖండ’ సినిమాపై మొదటి నుంచి కూడా భారీ అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్లో గతంలో రెండు సంచలన విజయాలు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ కూడా అనూహ్యమైన రెస్పాన్స్ ను రాబట్టుకుంది. బాలకృష్ణ అఘోరా పాత్రను హైలైట్ చేస్తూ వదిలిన ఈ టీజర్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం అవుతున్న ఖర్చు హాట్ టాపిక్ గా మారింది. అందరూ ఈ సినిమా బడ్జెట్ ను గురించే మాట్లాడుకుంటున్నారు.ఈ సినిమా కోసం 60 కోట్లకు పైనే ఖర్చు చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. బాలకృష్ణ పారితోషికం కాకుండానే ఈ ఫిగర్ చెబుతున్నారు. బాలకృష్ణ కెరియర్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందుతోన్న సినిమా ఇదేనని అంటున్నారు. బడ్జెట్ పరంగా కూడా ఈ సినిమా ప్రత్యేకతను సంతరించుకుంది. ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణ విలువల పరంగా ఎంతమాత్రం రాజీ పడటం లేదట. కంటెంట్ పై వాళ్లకి గల నమ్మకమే అందుకు కారణమనే టాక్ వినిపిస్తోంది. చూస్తుంటే బాలకృష్ణ – బోయపాటికి హ్యాట్రిక్ హిట్ పడేలానే ఉంది.