తిరుమలపై సోషల్ మీడియా ప్రచారం అవాస్తవం

రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ ధర్మకర్తల మండలితో చర్చించి తిరుమల శ్రీ వారి ఆలయంలో జూన్ 30వ తేదీ వరకు భక్తులకు దర్శనం నిలిపి వేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం.

భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించే విషయంపై ధర్మకర్తల మండలి సరైన సమయంలో తగు నిర్ణయం తీసుకుంటుంది. కాగా ఇలాంటి అవాస్తవ ప్రచారం చేస్తున్న వారి మీద టీటీడీ యాజమాన్యం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని TTD ప్రజా సంబంధాల అధికారి ప్రకటన విడుదల చేసారు.