బాలీవుడ్ కంగనా వ్యవహార శైలి అదోరకం. హీరో ఎవరైనా పట్టించుకోనంటున్న కథానాయిక బాలీవుడ్ ఇండస్ట్రీలో పాత్ర బాగుంటేనే చేస్తానంటు ముందుకు వస్తుంది. నేనింతే నా నిర్ణయం మారదంటూ మొండికేసే నటీమణి ఈ ముద్దుగుమ్మ.
బాలీవుడ్లో కంగనా పేరు ఎత్తితేనే ప్రస్తుతం దర్మక, నిర్మాతలు హడలెత్తిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కంగనా రనౌత్ తనకు నచ్చిన పాత్రలుంటేనే చేస్తానని తెగేసి చెబుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. కొందరు హీరోయిన్లు మాత్రం అగ్ర కథనాయకుల సినిమాలంటే తమ కాల్షిట్లు బిజీగా ఉన్నా వాటిని రద్దు చేసి అగ్ర హీరోల సరసన నటించడానికి ఆసక్తి కనబరుస్తారు. ప్రస్తుతం ఇది సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న తతంగమే. అయితే కంగనా మాత్రం అవేమి పట్టుంచుకోకుండా తనకు నచ్చిందే చేస్తానని చెప్పడం గమనార్హం. ప్రస్తుతం అగ్ర హీరోల సరసన నటిస్తే ఇండస్ట్రీలో నాలుగు కాలాలపాటు నిలదొక్కుకుని..నాలుగు రాళ్లు వెనకెసుకోవచ్చనే భ్రమలో చాలా మంది భామలున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కంగనా నా స్టైల్ డిఫారెంట్ అంటూ తెగేసిచెబుతుండటం కొందరికీ మింగుడు పడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నా పేరు కంగనా నేనింతే..!
బాలీవుడ్ కథానాయికలలో కంగనా స్థానం ప్రత్యేకం. తనకి తోచింది మాత్రమే చేస్తుంది .. ఎవరి కోసం కాంప్రమైజ్ కాదు అనే కామెంట్ ఆమెపై వుంది. తాజాగా కంగనా కూడా అదే మాటను అంగీకరించింది. “నిజమే నేను నాకు నచ్చిన పనులను మాత్రమే చేస్తాను .. నాకు ఇష్టమైన పాత్రలనే అంగీకరిస్తాను. స్టార్ హీరోల సరసన అవకాశమే అయినా, పాత్ర పరంగా ప్రాధాన్యత లేకపోతే నేను ఒప్పుకోను.
హీరోనేనా కథ నచ్చాలాంటోన్న భామ..!
బాలీవుడ్ బడా హీరోలలైతే ఏంటీ పని లేదని కంగనా కొట్టిపారేస్తోంది. ఎందుకంటే పాత్ర తనకు నచ్చితేనే నటిస్తానని చెబుతుంది. ఇటీవల కాలంలో సల్మాన్ సరసన ‘సుల్తాన్’లో చేసే అవకాశం వచ్చింది. అనుష్క శర్మ చేసిన పాత్ర కోసం ముందుగా నన్నే అడిగారు. కొన్ని కారణాల వలన చేయనని చెప్పాను. అందుకు ఆ నిర్మాతకి కోపం వచ్చినా నేను పెద్దగా పట్టించుకోలేదు. ఇక రణబీర్ కపూర్ జోడీగా ‘సంజూ’ చేసే ఛాన్స్ కూడా ముందుగా నాకే వచ్చింది. ఆ పాత్ర నా స్థాయికి తగినది కాదనే చేయలేదు. రణబీర్ స్వయంగా కాల్ చేసినా NO అనేశాను” అంటూ చెప్పుకొచ్చింది.