ఈ “Q” చూస్తే కన్నీరు ఆగదంతే..

కరోనా రక్కసి కోరల్లో నుంచి తప్పించుకుందామని వలస కూలీలు కాలి నడకన సొంత ఊళ్లకు వెళ్లడం లేదు. కనీసం పట్టేడన్నం, నిలువ నీడ లేక మండుటెండల్లో రైల్వే ట్రాకులు, రోడ్డు పోడుతా దారి పట్టుకుని బతుకు జీవుడా అంటూ కాళ్లిడుస్తున్నారు.

కరోనా మహామ్మారి వ్యాప్తి లాక్ డౌన్ కారణంగా కనీసం కూలీ పనులు దొరక్క దక్షిణం నుంచి ఉత్తరాది రాష్ట్రాల్లోని అమ్మానాన్నల వద్దకు వలస కూలీలు “Q” కట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వలస కూలీలను ఆదుకుంటామని చెబుతున్నప్పటికి కనీస అవసరాలు కూడా కార్మికుడుకి సహాయం అందడంలో ఆలశ్యం అవుతోంది. ఈ విపత్కర అత్యవసర సమయంలో కూడా అలసత్వం వహిస్తున్నారు. ఈ కారణంగా వేల కిలో మీటర్లు పొట్ట చేత పట్టుకొని వచ్చిన కార్మికులు కన్నీళ్లతో కాలం వెలిబుచ్చుతూ పట్టించుకునే నాధుడు నిర్లక్ష్యం చేస్తుండటం, కరువవడంతో లబోదిబోమంటున్నారు.