కేరళలో కరోనా సోకని వృద్ధులు

కేరళలోని కొట్టాయం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఇరవై మూడు రోజులు చికిత్స తర్వాత ఓ వృద్ధ దంపతులు డిశ్చార్జ్ అయ్యారు. ఓ వైపు కేరళలో కరోనా మహామ్మారి కోరలు చాచుతుంటే ఈ వృద్ధ దంపతులు థామస్ 93, మారియమ్మ 86 ఆస్పత్రిలో గుండె, మధుమేహం మరియు రక్తపోటు రుగ్మతల చికిత్స తీసుకుని ఇంటికి చేరుకున్నారు. ఈ దంపతులు ఇటలీ నుంచి రావడం వాళ్ల పిల్లలకు కరోనా ఉండటం, వీరిరువురికి జ్వరం మరియు దగ్గుతో సహా సంక్రమణ లక్షణాలతో బాధపడుతుండటంతో ముందుగా పే వార్డులో చేర్పించగా, ప్రాథమిక వైద్య పరీక్షల ఆధారంగా ఇరువురి చికిత్స ప్రోటోకాల్స్ ఖరారు చేయబడ్డాయి. మెడికల్ ఐసియుకు ఆ తర్వాత ట్రాన్స్‌ప్లాంట్ ఐసియుకు తరలించామని వైద్యులు తెలిపారు. రెండు సార్లు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించినప్పటికి రిపోర్టులు నెగెటివ్ రావడంతో ఈ వృద్ధ దంపతులను డిశ్చార్జ్ చేసారు.