ముంబాయిలో అసలేమి జరుగుతోంది?? ఘోరం

ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ ఎదుట వేలాది మంది వలసదారులు గుమిగూడి నిరసన తెలిపారు. అందరూ వలస కార్మికులు, ప్రత్యేకంగా బీహార్-బెంగాల్ వాసులు, వీళ్లందరు తమ సొంత గ్రామాలు, ఇళ్లకు వెళ్లాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు.

కనీసం నిత్యావసరాలు సప్లయి లేకపోవడం, నిరుద్యోగం కారణంగా ఎలాంటి ఆదాయం లేకపోవడం, ప్రభుత్వాల మద్దతు రాకపోవడంతో సొంతూళ్లకు వెళ్లాలని భావించారు. ఈ రోజు ఎలాగైనా సరే రైళ్లు ప్రారంభమవుతాయని ఈ వలస కూలీలు ఆశించారు. కానీ లాక్ డౌన్ మే మూడు వరకు కొనసాగే ప్రకటన రావడంతో ఆందోళన చెందారు. ఈ భారీ స్థాయిలో జనం ఎలా ఒక్కటయ్యారో పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. జనాన్ని గుంపులుగా ఉండకుండా చెదరగొట్టారు.