ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిడుగు హెచ్చరికలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో పిడుగులు పడుతాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖహెచ్చరించింది. ఈ రెండు జిల్లాల్లో పలు మండలాల వ్యాప్తంగా పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసారు.విజయనగరం జిల్లాల్లోని బొబ్బిలి,బాడంగి, రామభద్రాపురం, సాలూరు, తెర్లాం అలాగే విశాఖ జిల్లాలోని విశాఖపట్నం అర్బన్& రూరల్, కె. కోటపాడు, చోడవరం, అనకాపల్లి, సబ్బవరం, పెందుర్తి, గాజువాక, పరవాడ, అనంతగిరి, మాకవరపాలెం, రావికమతం ఈ పిడుగు జొనులోన్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు రైతులు,కూలీలు, పశు ,గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ తెలిపారు.