కొబ్బరి చెట్టుపై పిడుగు పడి ప్రమాదం తప్పింది

APలోని కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలంలో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లలు పడింది. ఈ క్రమంలో గుడుపల్లె మండలం కుప్పిగాని పల్లె గ్రామ పంచాయితీలోని కోటచెంబగిరి గ్రామ సమీపంలో పిడుగు పడింది. ఓ వైపు చిరుజల్లులు పడుతూనే పెద్ద మెరుపుతో కూడిన శబ్దం రావడంతో గ్రామీణులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

గ్రామం పక్కనే ఓ కొబ్బరి చెట్టుపై పిడుగు పడిందన్న విషయం తెలుసుకుని కోటచెంబగిరి గ్రామ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.