కలియుగ దైవంకు భక్తుల కరువు

నిత్యం వేలాది లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడే కలియుగ వైకుంఠం తిరుమల-తిరుపతి దేవస్థానం ఖాళీగా కనబడుతోంది. కారణం కరోనా మహామ్మారి వైరస్ సోకకుండా భక్తులు దేవదేవుని దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు.తిరుపతి కపిలతీర్దం నుంచి తిరుమల ఆలయం వరకు నిర్మానుష, ప్రశాంతమైన వాతావరణం మనకు దర్శనమిస్తున్నాయి. ఐతే శ్రీ లక్ష్మీ పద్మావతి వేంకటేశ్వర సమేతంగా స్వామి అమ్మవార్లకు పూజలు యధావిధిగా శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి.