కరోనా వైరస్ కొత్త పరీక్షలు

క‌రోనా వైర‌స్ సంక్ర‌మించిన‌ట్టు గుర్తించ‌డానికి మ‌రో ప‌రీక్ష‌ను అందుబాటులోకి తెచ్చింది. కరోనా వైర‌స్ ఉందా? లేదా అనేది ఆక్సీమీట‌ర్ల ద్వారా ప్రాథమికంగా గుర్తించవ‌చ్చు. జలుబు, పొడి దగ్గుతోపాటు, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది, ఆయాసం, జ్వరం రావడం క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాలుగా వైద్య‌నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలు ఒక్క కరోనా బాధితుల్లోనే కాకుండా ఎంఫిసెమా, బ్రాంకైటీస్‌తో బాధ పడుతున్న వారికి కూడా ఉంటాయి. ఇలాంటి గందరగోళం లేకుండా కరోనా సంక్ర‌మించినిట్టు ప్రాథమికంగా గుర్తించడానికి చాలా సులువైన పద్ధతిని క‌నుగొన్నారు బ్రిటన్‌లోని ‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ అండ్‌ కేర్‌ ఎక్స్‌లెన్స్‌’ మాజీ సలహాదారు, ఈస్ట్‌ యార్క్‌షైర్‌కు చెందిన జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ నిక్‌ సమ్మర్టన్‌.

మ‌న శరీరంలోని రక్తంలో ఆక్సిజన్‌ శాతం ఆధారంగా కరోనా వైర‌స్ సొకిందా..లేదా అనే విషయాన్ని ప్రాథమికంగా గుర్తించవచ్చు. రక్తంలోని ఆక్సిజన్‌ శాతాన్ని ‘పల్స్‌ ఆక్సిమీటర్ల’ ద్వారా సులభంగా కనుక్కోవచ్చు. ఈ మీట‌ర్ల ధ‌ర‌ 1500 నుంచి 1800 రూపాయల వ‌ర‌కు ఉంటుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ ఆక్సీ మీట‌ర్లు అందుబాటులో ఉన్నాయి. పల్స్‌ శబ్దం ద్వారా ర‌క్తంలోని ఆక్సీజ‌న్‌ను ఈ మీట‌ర్లు గుర్తిస్తాయి. సాధారణంగా ఆరోగ్య వంతుల్లో ఆక్సిజన్‌ పల్స్‌రేట్‌ 95 శాతం ఉంటుంది. ఎలాంటి జబ్బులు లేనప్పటికీ కొందరిలో సహజంగానే ఇంతకన్నా ఆక్సిజన్‌ పల్స్‌ రేట్‌ తక్కువగా ఉండవచ్చు.

ఆక్సిజన్‌ పల్స్‌ రేట్‌ను ప్రతి రెండు, మూడు గంటలకోసారి పరీక్షించాలి. పల్స్‌ రేట్‌ రెండు, మూడు శాతం పడి పోయినట్టు గుర్తిస్తే వెంట‌నే వైద్యుడిని సంప్రదించాల‌ని సూచిస్తున్నారు డాక్టర్‌ సమ్మర్టన్‌. దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం లాంటి లక్షణాలు రాకముందే ఆక్సిజన్‌ పల్స్‌ రేట్‌ పడి పోవడం ద్వారా క