నేటితో తిరుమల వసంతోత్సవాల ముగింపు

నేటితో తిరుమల వసంతోత్సవాల ముగింపు

తిరుమలలో జరుగుతున్న వసంతోత్సవాలు భక్తులు లేకుండానే జరుగుతున్నాయి. నేటితో వసంతోత్సవాలు ముగియనుండగా, నిన్న 20 వేల మందికి లోపే భక్తులు స్వామిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం కూడా పడిపోయింది. కరోనా పెరుగుతుండటం, ఆంక్షల నేపథ్యంతో పాటు, స్థానికంగా టికెట్లను జారీ చేయడాన్ని నిలిపివేయడంతోనే భక్తుల రాక తగ్గిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక నేడు వసంతోత్సవాల ముగింపు సందర్భంగా సాయంత్రం ఆస్థానం, తిరువీధుల్లో ఊరేగింపు జరుగనుంది.