హీరోయిన్ అమలాపాల్ పెళ్లి

హీరోయిన్ అమలాపాల్ పెళ్లి


దక్షిణాది అందాలభామ అమలాపాల్ తన ప్రియుడ్ని పెళ్లాడింది. ముంబయి గాయకుడు భవిందర్ సింగ్ తో ఆమె పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం చిత్రాలతో భారీ సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న అమలాపాల్ కు గతంలో దర్శకుడు ఏఎల్ విజయ్ తో వివాహం జరిగింది. అయితే కొంతకాలానికి ఇద్దరి మధ్య కలతలు రావడంతో వారి దాంపత్యం విచ్ఛిన్నమైంది. కానీ కొంతకాలానికే ఇరువురు విడాకులు తీసుకున్నారు.

చిరంజీవి సినిమాలో కాజ‌ల్, కోటిన్నరకి ఓకే చెప్పిన కాజల్..!

గతేడాది విజయ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. విడాకుల తర్వాత అమలాపాల్ పై అనేక ఊహాగానాలు వినిపించాయి. ఆమె మళ్లీ ప్రేమలో పడిందంటూ కథనాలు వచ్చాయి. తాజాగా తన పెళ్లితో అమలాపాల్ వాటన్నింటికి ముగింపు పలికింది. కాగా, ఈ పెళ్లికి ఇరువురి కుటుంబసభ్యుల ఆమోదం ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రభాస్ ఫ్యాన్స్ కి లవ్ ప‌జిల్ విసిరిన స్వీటీ