నటి పూజా హెగ్డేకు నాలుగు కోట్లు

టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే
పూజ హెగ్డేకు నాలుగు కోట్లు?
‘నారప్ప’ భారీ షెడ్యూల్ పూర్తి
బాలయ్య, బి.గోపాల్ సినిమా

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ పూజా హెగ్డే
నేమ్ ఫేమ్ అంతా ఇంతా కాదు. అబ్బో చెప్పేందుకు
హద్దులు లేవులే. టాలీవుడ్, బాలీవుడ్ ఈ వుడ్ ఆ వుడ్ అన్నింటిలో పూజా పూజా పేరు ఇండస్ట్రీ, ప్రేక్షకులు జపం చేస్తున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వరుస హిట్లతో దూసుకుపోతోంది. ఒక్క టాలీవుడ్1 లోనే కాదు బాలీవుడ్ లో కూడా పూజా హవా నడుస్తోంది. అక్కడ రెండు సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో కూడా రెండు సినిమాలు చేస్తోంది. అలా గజిబిజిగా బిజీ బిజీ హీరోయిన్ గా రాణిస్తున్న పూజ హెగ్డే తాజాగా సల్మాన్ ఖాన్ సరసన హిందీలో నటించడానికి అంగీకరించింది. ‘కభి ఈద్ కభి దివాలి’ పేరిట రూపొందే ఈ చిత్రంలో నటించడానికి గాను ఈ ముద్దుగుమ్మ భారీ మొత్తంలోరూ. 4 కోట్లు తీసుకుంటున్నట్టు తాజా సమాచారం.

అసుర‌న్ తెలుగులో రీమేక్‌
-తమిళంలో హిట్టయిన ‘అసురన్’ చిత్రాన్ని తెలుగులో వెంకటేశ్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘నారప్ప’ పేరిట రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూలు ముగిసింది. నెల రోజుల పాటు తమిళనాడులో ఈ షెడ్యూలును నిర్వహించారు. అయితే ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్న బాలకృష్ణ దీని తర్వాత ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగును జూన్ 10న బాలయ్య పుట్టిన రోజున ప్రారంభిస్తారట.