MAKE & MADE ఇండియా కాజల్ అగర్వాల్

కరోనా మహామ్మారి మనకు గుణపాఠాలు నేర్పుతోంది. లాక్ డౌన్, సామాజిక దూరం పాటిస్తూ కోవిడ్19 వైరస్ భూతాన్ని మన దేశం నుంచి తరిమేసి తర్వాత ఏమి చేయాలనే విషయాలను టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ అగ‌ర్వాల్ దేశ ప్ర‌జ‌ల‌కి సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది.

కరోనా సంక్షోభం తరిమికొట్టిన వెంటనే స్థానిక వ్యాపారులు, వ్యాపార సంస్థలకు ప్రజలంతా ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలి. మన కోసం మనమే మంచి చేసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది మరవొద్దు. భారతీయులు అందరూ ప్రతి క్షణాన్ని సెలవులు అన్నింటిని ఇండియాలోనే ఆశ్వాదించాలి.
తప్పక బయటనే ఆహారం తినేవాళ్లు స్థానిక రెస్టారెంట్, హోటళ్లనే స్వీకరించాలి. మన దేశంలో పండించిన కూరగాయల్ని, పండ్లను, Made in INDIA బ్రాండ్ల పాదరక్షలు, బట్టలు కొనుగోలు చేస్తూ భారత్ వ్యాపారులకు ఆర్థికంగా సహాయం, ప్రోత్సాహం అందించాలి. కరోనా కారణంగా దెబ్బ తిన్న భారత ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు మేము సైతం ముందున్నామని అడుగులు ఐక్యంగా వేయాలని విజ్ఞప్తి చేసారు.