ఉగాది వేడుకగా RRR పోస్టర్ విడుదల

ఉగాది వేడుకగా RRR పోస్టర్ విడుదల

2020లో టాలీవుడ్ టాప్ మూవీ ఆర్ఆర్ఆర్ సినిమా టైటిల్ ఫ్యాన్స్ ఎదురు చూపులకు తెరపడింది. ఉగాది పర్వదినం సందర్భంగా టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆవిష్కరిస్తున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ యస్‌.యస్‌. రాజమౌళి, హీరో జూనియర్ ఎన్టీఆర్‌,
హీరోయిన్ అలియా భట్ ట్వీట్ చేశారు. మూవీ అఫియల్ ట్విట్టర్ అకౌంట్‌, నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఇదే విషయం ధృవీకరించింది. కరోనా వైరస్ కట్టడి కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఇంట్లో సురక్షితంగా ఉండండి, ONLINEలో ఉంటూ థ్రిల్ అవ్వండి. ప్రింట్లు, ఫ్లెక్సీలు వద్దు ఇడే వినయపూర్వక విజ్ఞప్తి, మార్చి25 బుధవారం’ఆర్ఆర్ఆర్’ మోషన్ పోస్టర్ వస్తోందని రాజమౌళి ట్వీట్ చేశాడు. అభిమానుల్నీ, ప్రేక్షకుల్నీ ఉద్దేశించి దేశమంతా లాక్‌డౌన్ ఇదే మానవ ప్రపంచ మనుగడకే సంక్షోభ కాలం.
మన వంతు కృషిగా ఇంట్లో ఉండాలి సహకరించాలి అంటూ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ టైటిల్ లోగోను ఉగాది రోజు మోషన్ పోస్టర్‌తో ఆవిష్కరిస్తున్నామన్నారు NTR.