రేపే అఖిల భారత మేయర్ల సమావేశం

రేపే అఖిల భారత మేయర్ల సమావేశం

ఉత్తర్ ప్రదేశ్ పట్టణ అభివృద్ధి విభాగం నిర్వహణ లో 2021 వ సంవత్సరం డిసెంబర్ 17 న వారాణసీ లో జరుగనున్న ‘ఆల్ ఇండియా మేయర్స్ కాన్ఫరెన్స్’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ రోజు న ఉదయం 10:30 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించడం తో పాటు, ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు కూడాను. దేశవ్యాప్తం గా వివిధ రాష్ట్రాల కు చెందిన మేయర్ లు ఈ సమావేశం లో పాలుపంచుకోనున్నారు. ‘‘న్యూ అర్బన్ ఇండియా’’ అనే అంశం ఈ సమావేశాని కి ఇతివృత్తం గా ఉన్నది.

పట్టణ ప్రాంతాల లో జీవించడం తాలూకు సౌలభ్యాని కి పూచీ పడాలనేది ప్రధాన మంత్రి నిరంతర ప్రయాస గా ఉంటూ వస్తోంది. శిథిలావస్థ కు చేరుకొన్న పట్టణ ప్రాంత మౌలిక సదుపాయాలు అనే అంశం తో పాటుగా సౌకర్యాల కు కొదువ అనే అంశాన్ని కూడా పరిష్కరించడానికి ప్రభుత్వం అనేక పథకాల ను, అనేక కార్యక్రమాల ను ప్రవేశపెట్టింది. ఈ ప్రయాసల లో పట్టణ ప్రాంత ముఖచిత్రం రూపు రేఖల ను మార్పు చెందింప చేయడం లో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం నమోదు చేసిన గొప్ప ప్రగతి పట్ల.. ప్రత్యేకించి గడచిన 5 సంవత్సరాల లో చోటు చేసుకొన్న అభివృద్ధి పట్ల.. ప్రత్యేక శ్రద్ధను తీసుకోవడం జరిగింది.

పట్టణ అభివృద్ధి రంగం లో భారత ప్రభుత్వం తో పాటు, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం యొక్క కీలక కార్య సాధనల ను కళ్ళ కు కట్టడం కోసం డిసెంబర్ 17 నుంచి 19 వ తేదీ ల మధ్య కాలం లో ఒక ప్రదర్శన ను కూడా నిర్వహించడం జరుగుతున్నది.

ఈ కార్యక్రమం లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి కూడా పాల్గొంటారు.