టూల్ కిట్ ట్వీట్ డిలీట్ చేయాలని గ్రెటాకు సూచన

టూల్ కిట్ ట్వీట్ డిలీట్ చేయాలని గ్రెటాకు సూచన

టూల్ కిట్ వ్యవహారంలో స్వీడన్ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్ బర్గ్ కు దిశా రవి ముందే మెసేజ్ పంపినట్టు పోలీసులు చెబుతున్నారు. వాట్సాప్ లో గ్రెటాకు సందేశం పంపిందని అంటున్నారు. టూల్ కిట్ ను వెంటనే డిలీట్ చేయాల్సిందిగా హెచ్చరించిందని అంటున్నారు. ఆ పోస్టును డిలీట్ చేయకపోతే యూఏపీఏ (చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం) కింద కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని గ్రెటాకు ఆమె చెప్పినట్టు సమాచారం.టూల్ కిట్ లో తన పేరు ఉండడంతో వెంటనే ఆ ట్వీట్ ను తొలగించాల్సిందిగా గ్రెటాను దిశా రవి కోరిందని ఓ సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. దిశ చెప్పాకే గ్రెటా ఆ ట్వీట్ ను డిలీట్ చేసిందని, తర్వాత మార్పుచేర్పులు చేసిన టూల్ కిట్ ను పోస్ట్ చేసిందని చెబుతున్నారు. టూల్ కిట్ లో మార్పులు చేసింది దిశానేనని అంటున్నారు.‘‘నువ్వు టూల్ కిట్ పోస్ట్ చేయకుండా ఉంటేనే మంచిది. కొన్ని రోజులు దీని గురించి మాట్లాడకుండా ఉంటేనే మేలు. ముందు నేను లాయర్ తో మాట్లాడతా. మన పేర్లు అందులో ఉన్నాయి. ఈ కిట్ ను మనం పోస్ట్ చేస్తే మనపై యూఏపీఏ కింద కేసులు పెట్టే అవకాశం ఉంది’’ అంటూ ఆమె గ్రెటాకు వాట్సాప్ మెసేజ్ పంపిందని పోలీసులు చెబుతున్నారు.