ప్రేమ పెళ్లికే సిద్ధ‌మంటున్న త్రిష‌

ప్రేమ పెళ్లికే సిద్ధ‌మంటున్న త్రిష‌
అందంగా లేకున్నా ఫ‌ర్వాలేదంటున్న భామ‌
మంచి మ‌న‌సున్న‌వాడు కావాల‌ని ష‌ర‌తు

– ప్ర‌ముఖ సినిమా న‌టి త్రిష‌కు భర్త కావాల‌ని ఊహించుకుంటున్నారా..!.అయితే ఈ అర్హ‌త‌లున్నాయో లేదో ఒక సారి చెక్ చేసుకోండి. ఇంత‌కీ ఆవిడ గారు పెట్టిన ష‌ర‌తులు ఏమిట‌నేగా మీ డౌటు. అయితే ఒక్క‌సారి ఈ క‌థ‌నం చ‌ద‌వండి. అవేంటో మీకే ఇట్టే అర్థం అవుతాయి.
– మోడ‌లింగ్ రంగం నుంచి వ‌చ్చి సినిమాలో ప్ర‌ముఖ హీరోయిన్‌గా త్రిష నిల‌దొక్కుకున్నారు. అయితే ఆమె హీరోయిన్ కావ‌డం వెనుక ఎంతో శ్ర‌మ దాగి ఉంది. ఆమె నేరుగా హీరోయిన్‌ కాలేదు. న‌టి సిమ్రాన్‌కు స్నేహితురాలిగా ఓ క్ష‌ణం పాటు మెరుపులా త‌ళుక్కుమ‌ని మెరిసింది. ఆ త‌ర్వాత హీరోయిన్‌గా కుదురుకుంది. ఈమె సినీ, వ్య‌క్తిగ‌త జీవితాలు ఒక‌దానికొక‌టి పెన‌వేసుకున్నాయి. త్రిష అంటేనే సంచ‌ల‌నాల‌కు మారుపేరైంది. ప్రేమ కోసం ఆమె ప‌రిత‌పిస్తోంటోంది. వ‌రుణ్ మ‌ణిమ‌న్ అనే నిర్మాత‌, వ్యాపార‌వేత్త‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో కూరుకుపోయి…ఇద్ద‌రూ చెట్ట‌ప‌ట్టాలేసుకుని తిరిగారు. చివ‌రికి పెళ్లితో శభం కార్డు ప‌డుతుంద‌నుకుంటే…ఉల్టా అయ్యింది. స‌రే అది వేరే విష‌యం అనుకోండి.

త్రిష చేతినిండా సినిమాలే సినిమాలు:
– త్రిష చేతినిండా సినిమాలే సినిమాలున్నాయి. ఎందుకంటే జ‌యాప‌జ‌యాలు త్రిష‌ను వెంటాడుతున్నా, ఎక్క‌డా నిరుత్సాహానికి గురి కాలేదు. తాజాగా ఆమె 96 చిత్రం మ‌ళ్లీ ఆమె కెరీర్‌కు ప్రాణం పోసింది. దీంతో ఆమె చేతి నిండా సినిమాలే సినిమాలు. హీరోయిన్‌గా నిన్న‌మొన్న సినిమాల్లోకి వ‌చ్చిన‌ట్టు అనిపించినా…ఆమెకు సినీ జీవితానికి 18 ఏళ్లు అంటే న‌మ్మ‌శ‌క్యం కాదు. కానీ ఇది పచ్చి నిజం. అయినా ఆమె హీరోయిన్‌గా కుర్ర‌కారును మ‌త్తెక్కిస్తోంది.

ప్రేమించే పెళ్లి:
– ఇంత‌కూ నీ పెళ్లెప్పుడు అమ్మ‌డు అని ఓ ఇంట‌ర్వ్యూలో త్రిష‌ను ప్ర‌శ్నించ‌గా బోలెడు క‌బుర్లు చెప్పిందామె. తాను పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పానే త‌ప్ప‌, ఎప్పుడు, ఎవ‌రిని అనే విష‌యాలు చెప్ప‌లేదు క‌దా అని ఎదురు ప్ర‌శ్నించిన త్రిష‌…చాలా తెలివైన అమ్మాయ‌ని అనిపించుకొంది. అయితే కుటుంబ పెద్ద‌లు చెప్పిన‌, చూసిన వాడిని మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పెళ్లి చేసుకునేది లేద‌ని త్రిష కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పింది. ఆరు నూరైన‌, నూరు ఆరైనా స‌రే….ప్రేమించే పెళ్లి చేసుకుంటాన‌ని స్ప‌ష్టం చేసింది. త‌న‌కు కావాల్సిన వ‌రుడి అర్హ‌త‌ల‌ను కూడా త్రిష ఓ లిస్ట్ చెప్పింది.

అర్హ‌త‌ల లిస్ట్ ఇదే..చెక్ చేసుకోండి:
– తనను చక్కగా చూసుకునేవాడై ఉండాలని, తను హీరో కానవసరం లేదని తేల్చి చెప్పింది. అంతే కాదండోయ్ అన్నిటికి మించి అందంగా ఉండాల్సిన పనే లేద‌ని కూడా త్రిష ప్ర‌క‌టించింది. అయితే మంచి మనసున్నవాడై మాత్రం ఉండాలని కండీష‌న్ పెట్టింది. వీటితో పాటు తనను అర్థం చేసుకుని బాగా చూసుకోవాలని త్రిష గోముగా చెప్పింది. అలాంటి వ్యక్తి తారస పడితే వెంటనే పెళ్లి చేసుకుంటానని త్రిష పేర్కొంది. అయ్యా బాబులు…మంచి ప‌నికి ఆల‌స్యం ఎందుకు నాయ‌నా..? ఆల‌స్యం అమృతం విషం అంటారు పెద్ద‌లు. త్రిష చెప్పిన వాటిలో అర్హులైన వాళ్లు ఆమెకు తార‌స ప‌డేందుకు క‌ద‌లండి ముందుకు…