స్వీయ నిర్బంధంలో సెల‌బ్రిటీలు

-ప్రస్తుతం క‌రోనా వైర‌స్ ట్రెండ్ న‌డుస్తోంది. దీంతో సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు అంద‌రూ స్వీయ నిర్బంధంలో ఉన్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగానే చాలా మంది సెల‌బ్రిటీలు ఎవ‌రికీ వారు స్వీయ నిర్భంధంలోఉన్నారు. దీంతో క్ష‌ణం కూడా తీరిక లేకుండా గడిపే సినీన‌టులకు ఇప్పుడు కావాల్సినంత విరామం దొరికి న‌ట్లైంది.అయితే ఎవ‌రికి తోచిన‌ట్లుగా వారు త‌మ త‌మ క‌ళ‌ల్ని బ‌య‌ట‌కు తీస్తూ దానికి సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పంచుకుంటూ అభిమానుల‌తో కొంచెం ట‌చ్‌లో ఉంటున్నారు. తాజాగా ఒక అమ్మ‌డి త‌న ఇద్ద‌రు మిత్రుల‌తో వీడియో కాల్ ద్వారా మాట్లాడింది. మాట్లాడ‌మే కాదండోయే.. అందులో ఒక మిత్రునీ సీక్రెట్స్ సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్ట‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఇంత‌కీ ఎవ‌రా..? సెల‌బ్రిటీ..? అనేగా మీ సందేహం . అయితే ఈ క‌థ‌నం చ‌ద‌వండి..ఆమె ఎవ‌రో మీకే తెలుస్తుంది.

త్రిష‌ వీడియో కాల్‌:
– తాజాగా హీరోయిన్ త్రిష త‌న ఇద్ద‌రు ఫ్రెండ్స్‌తో వీడియో కాల్ మాట్లాడింది. దీనికి సంబంధించిన స్క్రీన్‌ షాట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. స్వీయ నిర్భంధంలో ఉన్న నాకు ఇద్ద‌రు ఫ్రెండ్స్ రానా ద‌గ్గుబాటి, అల్లు అర్జున్‌ మంచి కంపెనీ ఇచ్చార‌ని చెప్పుకొచ్చింది. ఈ క్ర‌మంలో బ‌న్నీ సీక్రెట్‌ను బ‌య‌ట‌పెట్టేసింది. ఇన్‌స్టాలో 5.8 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు ఉన్న బ‌న్నీ ఓ ప్రైవేట్ అకౌంట్‌ను న‌డుపుతున్న‌ట్లు వెల్ల‌డించింది.

సీక్రేట్ ఇదే..!:
-ఈ ప్రైవేట్ అకౌంట్‌ను కేవ‌లం 250 మంది ఫాలో అవుతుండ‌గా, ఇప్ప‌టివ‌ర‌కు 744 పోస్టులు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఇక టాలీవుడ్‌లో అంతంత‌మాత్రం అవ‌కాశాలు ఉన్న ఈ హీరోయిన్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాతో రీఎంట్రీ ఇస్తుంద‌ని అంతా భావించారు. కానీ ఆ సినిమా నుంచి వైదొల‌గిన‌ట్లు ప్ర‌క‌టించి అంద‌రినీ షాక్‌కు గురి చేసిన విష‌యం తెలిసిందే. కాగా రానా, త్రిష డేటింగ్‌లో ఉన్న‌ట్లు ఎన్నో వార్తలు వెలువ‌డ్డాయి. దీనిపై ఓ కార్య‌క్ర‌మంలో స్పందించిన రానా ఆమెతో ఉన్న‌ అనుబంధం గురించి మాట్లాడుతూ.. త్రిష త‌న‌కు ద‌శాబ్ద కాలంగా మిత్రురాల‌ని తెలిపిన విష‌యం తెలిసిందే.