కరోనా కట్టడిపై కఠినం తప్పదు: కల్వకుంట్ల కవిత

కరోనా కట్టడిపై కఠినం తప్పదు: కల్వకుంట్ల కవిత

భారత్ దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రత్యేక వీడియో సందేశం విడుదల చేశారు. శార్వరి నామ సంవత్సరం అందరి కుటుంబాల్లో సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షిస్తూ కరోనా వైరస్ కట్టడికి కఠినంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తుంటే నాకేం అవుతుందిలే అనే నిర్లకక్ష్యం
మంచిదికాదన్నారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ స్వీయ నియంత్రణతో మనందరం ఇంటిలోనే ఉండటమే శ్రేయస్కరమని విజ్ఞప్తి చేసారు.

ప్రభుత్వ నిబంధనలు కఠినంగా ఉన్నా, అది మనల్ని కాపాడటానికే అనే విషయాన్ని గమనించాలన్నారు.
ఈ సమయంలో కుటుంబాలను వదిలేసి ప్రజలకు సేవ చేస్తున్న వైద్య సిబ్బంది, పోలీసు బృందాలు తదితర శాఖల అధికారులు, కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తి చాటుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలను కరోనా నుండి కాపాడటం కోసం మనందరం ప్రభుత్వంతో కలిసి నడవాలి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.