కౌన్సిల్ కు కల్వకుంట్ల కవిత: అధికారిక ప్రకటన విడుదల

కౌన్సిల్ కు కల్వకుంట్ల కవిత

నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ సీటును గులాబీ పార్టీ అధిష్టానం కల్వకుంట్ల కవితకు కేటాయించారు. గురువారంతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ గడువు ముగుస్తుండటంతో, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కవిత బుధవారం నాడు నామినేషన్ వేయనున్నారు. నిజామాబాద్ నుంచి రాజ్యసభకు, అసెంబ్లీ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిని పంపాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించడంతో, కూతురు కవితకు ఎమ్మెల్సీ స్థానం కేటాయించారు.

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ‌పదవికి నామినేషన్ వేసేందుకు బయలుదేరే ముందు శ్రీమతి కల్వకుంట్ల కవితకు అభినందనలు తెలిపిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ ‌జిల్లా ఎమ్మెల్యేలు.