TS బీజేపీ అధ్యక్షుడిపై TRS ఎన్ కౌంటర్

TS బీజేపీ అధ్యక్షుడిపై TRS ఎన్ కౌంటర్

అసెంబ్లీ మీడియా పాయింటులో కర్నె ప్రభాకర్ ప్రభుత్వ విప్ మాట్లాడుతూ బండి సంజయ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా భాధ్యత గా మాట్లాడాలని హెచ్చరించారు. తొలి రోజే నోటికి వచ్చినట్లు మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సంజయ్ ,లక్ష్మణ్ వారసత్వాన్ని పునికి పుచ్చుకున్నట్లు ఉంది. కనీస అవగాహన లేని నేతను ఆ పార్టీ అధ్యక్షునిగా నియమించడం కమలం పార్టీకే నష్టము. తెలంగాణలో ఏ ఓక్క వ్యక్తి పై అక్రమ కేసులు పెట్టలేదు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో అక్రమ కేసులు పెట్టినట్లుగా మేము ఎక్కడా కేసులు పెట్టలేదు. తొలి సారి ఏంపీ అయ్యాడు కాబట్టి.. కేంద్ర వ్యవహార శైలి ఆయనకు అర్థం కానట్లు ఉంది. కేంద్రం తెలంగాణపై సవతి ప్రేమ చూపిస్తుంది. ఢిల్లీ కి వస్తే నిధులు ఇప్పిస్తానన్న సంజయ్ ఇప్పటి వరకు కేంద్రం ఎన్ని నిధులు తెలంగాణకు ఇచ్చిందో లెక్కలు చెప్పాలి. బండి సంజయ్ పిల్లడిలా కాదు భాధ్యతగా మాట్లాడాలి.